Hathras:నేడు హత్రాస్‎కు రాహుల్ గాంధీ..తొక్కిసలాట మృతుల కుటుంబాలను పరామర్శించనున్న యువనేత

Hathras:కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం హత్రాస్‌లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. హత్రాస్‌లో సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Update: 2024-07-05 01:55 GMT

Hathras:నేడు హత్రాస్‎కు రాహుల్ గాంధీ..తొక్కిసలాట మృతుల కుటుంబాలను పరామర్శించనున్న యువనేత

Hathras:లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం హత్రాస్‌లో పర్యటించనున్నారు. సత్సంగ్ ఘటన జరిగిన తర్వాత సీనియర్ ప్రతిపక్ష నేత హత్రాస్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. తొక్కిసలాట మృతుల కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ కలుస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ తెలిపారు. రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం అలీఘర్‌లోని పిల్ఖానాలో హత్రాస్ ప్రమాదంలో మృతుల కుటుంబాలను కలవనున్నారు. దీని తర్వాత, ఉదయం 8:15 గంటలకు గ్రీన్ పార్క్, విభవ్ నగర్, హత్రాస్‌లో బాధిత కుటుంబ సభ్యులను కలుస్తారు. అంతకుముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం హత్రాస్‌లో పర్యటించి బాధితులను పరామర్శించారు.

హత్రాస్‌ తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ గురువారం అన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో విలేకరులతో రాయ్ మాట్లాడుతూ, "హత్రాస్ ఘటన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం అన్నారు. కాగా గురువారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హత్రాస్‌ను సందర్శించారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు, గాయపడిన వారికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జితో కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నట్లు అజయ్ రాయ్ అన్నారు. ఈ ఘటనపై విచారణ చేసేందుకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సత్సంగంలో తొక్కిసలాట కారణంగా 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయపడ్డారు. చాలా మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News