కరోనాపై ప్రజలు మూఢ నమ్మకాలను వీడటం లేదు. ఈ మహమ్మారి సోకకుండా ఉండాలంటే మూడు రోజుల పాటు గ్రామంలో ఎవరూ ఉండకూడదని గ్రామా దేవత మారెమ్మ దేవి చెప్పిందని ఊరంతా కాలీచేసిన ఘటన కర్నాటకలోని తూమకూరు జిల్లాలో చోటు చేసుకుంది.
కరోనా జబ్బు రాకుండా ఉండాలనే తక్షనమ్ ఊరు వదలి వెళ్లిపోవాలని గ్రామా దేవత మారెమ్మ చెప్పిందని అందుకే మేమంతా ఊరు బయటకి వచ్చామని ముద్దనహళ్లి గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గ్రామంలోని అందరు తమ కోళ్లను పశువులను అంతా తీసుకోని బయటకు వచ్చి ఊరు శివారులలోని పంటపొలాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. దింతో ముద్దనహళ్లి గ్రామం అంతకుడా నిర్మానుష్యంగా మారింది.