JP Nadda: జమ్ముకశ్మీర్‌కు ఎన్డీయే ప్రభుత్వమే రాష్ట్ర హోదా కల్పిస్తుంది
JP Nadda: ఆర్టికల్ 370 రద్దు చేసినపుడే ఆ విషయం స్పష్టం చేశాం
JP Nadda: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఎన్డీయే ప్రభుత్వమే కల్పిస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడే ఈ విషయం స్పష్టం చేశామని ఆయన తెలిపారు.రాష్ట్ర ప్రజలుబుల్లెట్లను తిరస్కరించి బ్యాలెట్ మార్గాన్ని ఎంచుకున్న చారిత్రక సందర్భమిది... వారు బుల్లెట్లకు తగిన సమాధానం చెప్పారని ఆయన అన్నారు.
జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు ఆయన రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు శాంతిని, అభివృద్దిని కోరుకుంటున్నారని రెండు విడతల పోలింగ్ లో తేలిందని ఆయన చెప్పారు.