మద్యం షాపులు తెర‌వ‌క‌ముందే భారీ క్యూ

Update: 2020-05-06 03:55 GMT

లాక్ డౌన్ ని పొడిగిస్తూ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. మందుబాబులు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. కరోనా వ్యాప్తి చెందకుండా కనీస దూరం పాటించాలన్న నిబంధనను సైతం పక్కన పెట్టేశారు. ఢిల్లీ-క‌ప‌శేర బార్డ‌ర్ లో వేకువ జామునే మ‌ద్యం షాపు తెర‌వ‌క‌ముందే జ‌నాలు పెద్ద సంఖ్య‌లో చేరుకుని క్యూలైన్ లో నిల‌బ‌డ్డారు.

మ‌రోవైపు హ‌ర్యానాలో ప్ర‌భుత్వం నేటి నుంచి కంటైన్ మెంట్ జోన్ల మిన‌హా గ్రీన్ జోన్ల‌లో మ‌ద్యం షాపులు తెరుచుకునే అవ‌కాశమిచ్చింది. దీంతో గురుగ్రామ్ లోని సోహ్‌నా అడ్డా చౌక్ లో ఉన్న ఓ మ‌ద్యం షాపు వ‌ద్ద‌కు మందుబాబులు భారీగా చేరుకుంటున్నారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈరోజు నుంచి మద్యం అమ్మకాలను తెలంగాణా ప్రభుత్వం ప్రారంభిస్తుందని నిన్నరాత్రి సీఎం కేసీఆర్ ప్రకటించారు. మద్యం ధరలు 16 శాతం పెంచుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. చీప్ లిక్కర్‌పై 11 శాతం రేటు పెంచుతున్నట్లు చెప్పారు.


Tags:    

Similar News