Tamil Nadu Minister tests corona positive: మరో మంత్రికి కరోనా పాజిటివ్‌

Tamil Nadu Minister tests corona positive: తమిళనాడులో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడగా.. తాజాగా మరో మంత్రికి కరోనా నిర్ధారణ అయింది

Update: 2020-07-10 15:21 GMT
Tamil Nadu Minister Sellur k raju tests corona positive

Tamil Nadu Minister Sellur k raju tests corona positive: తమిళనాడులో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడగా.. తాజాగా మరో మంత్రికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్ర సహకార శాఖ మంత్రి సెల్లూరు కె. రాజుకు ఇటీవల కరోనా పరీక్షలు చేయగా.. శుక్రవారం ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. దీంతో ఆయనను చికిత్స కోసం చెన్నైలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన కుటుంబసభ్యులు కూడా హోమ్ క్వారంటైన్ చేసినట్టు తెలుస్తోంది. కాగా మంత్రి రాజు కరోనా సోకిందని తెలుసుకున్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఫోన్‌లో మాట్లాడారు, ఈ సందర్బంగా మంత్రి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.

ప్రజలు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. తమిళనాడు కేబినెట్‌లో విద్యుత్‌ శాఖ మంత్రి పి. తంగమణి, ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. అన్బళగన్‌కు కరోనా నిర్ధారణ అయ్యింది. తాజాగా సెల్లూర్ కె. రాజుకు కరోనా పాజిటివ్‌ రావడంతో మంత్రులలో కరోనా భారిన పడిన వారి సంఖ్య మూడుకు చేరింది. మరోవైపు వారితో సంప్రదింపులు జరిపిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పలువురు మంత్రులు ఈ భయంతో కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. కాగా తమిళనాడులో ఇప్పటివరకు ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.


Tags:    

Similar News