Tamil Nadu: ఢిల్లీలో తమిళనాడు రైతుల ధర్నా
Tamil Nadu: జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన రైతులు
Tamil Nadu: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తమిళనాడుకు చెందిన రైతులు ధర్నా చేపట్టారు. వివిధ డిమాండ్ల సాధన లక్ష్యంగా చేపట్టిన నిరసనలు రెండో రోజు కొనసాగుతున్నాయి. పంటల ధరలు, రాష్ట్రంలోని నదుల అనుసంధానంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. జంతర్‌మంతర్ సమీపంలోని ఓ సెల్ టవర్ ఎక్కి రైతులు నిరసన తెలియజేశారు. దీంతో పోలీసులు రైతులను కిందకు దించేందుకు అగ్నిమాపక సిబ్బంది క్రేన్‌ను ఉపయోగించారు.