తమిళ జంట వినూత్న రిసెప్షన్.. సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న..

Tamil Nadu: కరోనా మహ్మారి పుణ్యమాని పెళ్లిళ్లు వర్చువల్‌ పద్ధతిలోనే జరుగుతున్నాయి.

Update: 2022-02-07 16:30 GMT

తమిళ జంట వినూత్న రిసెప్షన్.. సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న..

Tamil Nadu: కరోనా మహ్మారి పుణ్యమాని పెళ్లిళ్లు వర్చువల్‌ పద్ధతిలోనే జరుగుతున్నాయి. ఇటీవల ఇలాంటి వేడుకలు చాలానే చేస్తున్నారు. కోవిడ్‌ నిబంధనలు, ఇతర దేశాల నుంచి బంధువుల, స్నేహితులు రాకపోవడంతో తమిళనాడుకు చెందిన ఓ జంట రిపెప్షన్‌ను మెటావర్స్‌ టెక్నాలజీ సహాయంతో వైభవంగా జరుపుకుంది.

ఈ మెటావర్స్‌ టెక్నాలజీ అంటే ఏమిటంటే ఎక్కడో దూరాన ఉన్న వ్యక్తి మన ముందు ఉన్నట్టుగా మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి టెక్నాలజీతోనే తమిళనాడుకు చెందిన ఎస్పీ దినేష్‌, జనగనందిని రామస్వామి అనే జంట రిసెప్షన్ జరుపుకున్నారు. వారి పెళ్లి శివలింగపురంలో 6న జరిగింది.

ఇప్పుడు ఈ పెళ్లికి సంబంధించిన మెటావర్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. లెటెస్ట్‌ టెక్నాలజీని రిసెప్షన్‌కు వినియోగించుకోవడం వినూత్నంగా ఆలోచించడంతో కొత్త జంటకు పెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు.


Tags:    

Similar News