Supreme Court: ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
Supreme Court: వ్యాజ్యాలను విచారించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు
Supreme Court: సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైన రోజే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చే వాగ్దానాలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. పార్టీలు ఇస్తున్న ఉచిత హామీల తీరుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. త్వరలోనే దీన్ని లిస్ట్ చేస్తామని పేర్కొంది. ఉచిత హామీలు ప్రకటించే పార్టీల గుర్తులు, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసేందుకు ఎన్నికల సంఘం తన అధికారాలను ఉపయోగించేలా ఆదేశించాలని పిటిషనర్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.