Kolkata rape-murder case: కోల్‌కతా డాక్టర్ రేప్-మర్డర్ కేసులో రంగంలోకి దిగిన సుప్రీం కోర్టు

Kolkata rape-murder case: కోల్‌కతా డాక్టర్ రేప్-మర్డర్ కేసులో సుప్రీం కోర్టు రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు స్పష్టంచేసింది.

Update: 2024-08-18 11:44 GMT

Kolkata rape-murder case: కోల్‌కతా డాక్టర్ రేప్-మర్డర్ కేసులో రంగంలోకి దిగిన సుప్రీం కోర్టు

Kolkata rape-murder case: కోల్‌కతా డాక్టర్ రేప్-మర్డర్ కేసులో సుప్రీం కోర్టు రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసుపై విచారణ చేపట్టనుంది. 

ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్ర అభాసుపాలు చేయడంతో పాటు ఘటన పట్ల అధికార పార్టీ వైఖరిపై అనేక ఆరోపణలకు కారణమైంది. ఇది కేవలం ఒక్కరు చేసిన నేరం కాదని.. గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన ఈ ఘటనలో ఇద్దరు మంత్రుల పుత్రరత్నాల ప్రమేయం కూడా ఉంది అంటూ అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు విషయం బయటికి పొక్కితే ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో వాస్తవాలు బయటికి రాకుండా జాగ్రత్తపడుతోంది అనేది అక్కడ ప్రధానంగా వినిపిస్తోన్న ఆరోపణ.

ఈ ఘటనలో పోస్ట్ మార్టం రిపోర్ట్ సైతం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. మహిళా డాక్టర్ ఒంటిపై ఉన్న గాయాలను చూస్తే.. అవి ఒక్కరు చేసిన గాయాలు కావని.. అంతకంటే ఎక్కువ మంది దాడి చేసిన సందర్భాల్లోనే అలాంటి గాయాలు అవుతాయని పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొన్నట్టుగా తెలిసింది. అంతేకాకుండా బాధితురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఆనవాళ్లు సైతం లభించాయని.. అది ఒక్కరి వల్ల సాధ్యం అయ్యే పని కాదు అనే ఆరోపణలు కూడా వినిపించినప్పటికీ.. అక్కడి పోలీసు కమినర్ వినీత్ గోయల్ మాత్రం ఆ ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. పోస్ట్ మార్టం నివేదికపై అవాస్తవాలు ప్రచారం చేయొద్దని పోలీసు కమిషనర్ వినీతో గోయల్ ఆందోళనకారులకు విజ్ఞప్తిచేశారు.

ఇదిలావుంటే, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్స్ తమ నిరసన వ్యక్తంచేస్తున్నారు. అంతేకాకుండా వైద్య సేవలు అందించి ప్రాణాలు పోసే తమపై జరుగుతున్న దాడులను అరికట్టేలా కఠినమైన చట్టాలు తీసుకురావాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఆగస్టు 17న దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు మినహాయించి మిగతా విభాగాల్లో వైద్య సేవలు నిలిపేసి తమ నిరసన వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే తాజాగా సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News