DK Shiva Kumar: డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
DK Shiva Kumar: సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్
DK Shiva Kumar: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఎదుర్కొంటున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ డీకే శివకుమార్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 2013లో కర్ణాటక మంత్రిగా ఉన్న డీకే 74 కోట్లకు పైగా ఆదాయానికి లెక్కలు చూపించలేకపోయారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.