Kolkata doctor rape-murder case: కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ
Kolkata doctor rape-murder case: స్టేటస్ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించిన సీబీఐ
Kolkata doctor rape-murder case: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ- హాస్పిటల్ ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును వచ్చేవారం సమర్పించాలని కోర్టు ఆదేశించింది. నివేదిక సమర్పించేందుకు వారం సమయం ఇస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసు విచారణను వచ్చే మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది. అత్యాచార ఘటన జరిగిన సమయం, వివరాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్ సీబీఐకి ఇచ్చారా లేదా అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్చింది.