ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు!

ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు! ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు! ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు!

Update: 2020-09-17 10:20 GMT

దేశవ్యాప్తంగా సిట్టింగ్ మరియు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ లో ఉన్న కేసులలో విచారణను వేగవంతం చేయడానికి జిల్లాకో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చెయ్యాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు తోపాటు ట్రయల్ కోర్టులకు ఆదేశాలు జారీ చేస్తామని వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ఏడాదిలోపు పూర్తి చేయాలన్న పిటిషన్ పై జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ముఖ్య ధర్మాసనం విచారిస్తోంది. వివిధ హైకోర్టులు సుప్రీంకోర్టుకు ఇచ్చిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 2556 సిట్టింగ్ ప్రజాప్రతినిధులలు సహా మొత్తం 4442 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అమికస్ గతంలో కోర్టుకు తెలిపింది.. తెలంగాణలో 118 మందిపై పెండింగ్ లో ఉన్నాయి.

ఇందులో ఒక్క హైదరాబాద్ కు చెందిన 13 మందిపై సిబిఐ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఏపీలో 106 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు అమికస్ క్యూరీ చేసిన సిఫారసులపై సుప్రీంకోర్టు బుధవారం తన ఉత్తర్వులను రిజర్వు చేసింది. అమికస్ క్యూరీగా వ్యవహరించిన సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సరియా ఇచ్చిన సూచనలపై ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్ ఎన్వి రమణ, సూర్య కాంత్, హృషికేశ్ రాయ్ ధర్మాసనం తెలిపింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సిఫారసులను సమర్థించారు.. సుప్రీంకోర్టు నుండి ఏ ఆదేశాలు వచ్చినా, యూనియన్ ఆఫ్ ఇండియా స్వాగతిస్తుందని అన్నారు.  

Tags:    

Similar News