NEET UG Row: నేడు పార్లమెంట్ ముట్టడికి విద్యార్థులు పిలుపు..జంతర్ మంతర్ వద్ద నిరసన

NEET UG Row: ఎన్టీఏ (NTA), నీట్ పీజీ ( NEET UG) , పీజీ (PG), యూజీసీ నెట్ ( UGC NET) పరీక్షలలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ నేడు ఢిల్లీలో పార్లమెంట్ భవనం ముట్టడికి విద్యార్థులు పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన అనంతరం..విద్యార్థులు తమ డిమాండ్ల కోసం పార్లమెంటు వైపు కవాతు నిర్వహించునున్నారు.

Update: 2024-07-02 02:36 GMT

NEET UG Row: నేడు పార్లమెంట్ ముట్టడికి విద్యార్థులు పిలుపు..జంతర్ మంతర్ వద్ద నిరసన

NEET UG Row:నీట్ పేపర్ లీక్ అంశం దేశంలో ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. అనేక కోణంలో ఏజెన్సీలు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాయి. మరోవైపు ఎన్టీఏ-నీట్ యూజీ, పీజీ, యూజీసీ నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ డిమాండ్ల కోసం మంగళవారం పార్లమెంటు వైపు మార్చ్‌కు సిద్ధమయ్యారు. విద్యార్థులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. గత వారం బుధవారం ప్రారంభమైన ఈ పరీక్షల్లో ఆరోపించిన రిగ్గింగ్‌కు వ్యతిరేకంగా తమ ఆందోళనను కొనసాగించడానికి "ఇండియా ఎగైనెస్ట్ ఎన్‌టిఎ" బ్యానర్‌తో వందలాది మంది విద్యార్థులు నిరసనప్రదర్శన చేపట్టారు.

డిమాండ్లు ఏమిటి?

ఎన్‌టీఏపై నిషేధం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులు నిరసన చేపట్టారు. అందరికీ నీట్-యూజీని పునఃపరీక్షించాలని, పాత యూనివర్సిటీ-నిర్దిష్ట ప్రవేశ పరీక్ష విధానాన్ని పునరుద్ధరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వామపక్ష అనుబంధ AISA, ఢిల్లీ విశ్వవిద్యాలయం KYS సభ్యులు నిరసనలో పాల్గొన్నారు. వీరితోపాటు ఇతర విద్యార్థులు కూడా ఉన్నారు.వీరి నిరసన నేడు ఆరోరోజుకు చేరింది. దీంతో విద్యార్థులు జంతర్ మంతర్ భారీ ఎత్తున నినాదాలు చేస్తూ..విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ "ఎన్టీఏ వ్యతిరేక" నినాదాలు చేశారు.

కాగా నేడు పార్లమెంటుకు కవాతుగా వెళ్లాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. ప్రస్తుతం బీహార్, గుజరాత్‌లోని పలు కేంద్రాల్లో ఎన్‌టీఏ నిర్వహించిన పరీక్షల్లో పేపర్ లీక్, అవినీతి ఘటనలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇంతలో, రద్దు చేసిన UGC-NET పరీక్ష, ఉమ్మడి CSIR-UGC NET, నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET) నిర్వహణ కోసం NTA కొత్త తేదీలను విడుదల చేసింది. వీటిని ముందుగా వాయిదా వేశారు. UGC NET ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 4 వరకు మళ్లీ నిర్వహించనున్నారు. ఉమ్మడి CSIR-UGC NET జూలై 25-27 మధ్య నిర్వహిస్తారు. NCET జూలై 10న నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. 

Tags:    

Similar News