Steel Price Hike: స్టీల్‌పై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన స్టీల్, ఐరన్ ధరలు...
Steel Price Hike: *ఉక్రెయిన్ నుంచి నిలిచిపోయిన మెటీరియల్ *ప్రస్తుతం ఉన్న స్టాక్‌కు భారీగా పెరిగిన డిమాండ్
Steel Price Hike: రష్యా- ఉక్రెయిన్ మధ్య గొడవ ప్రభావం కాస్త మన దగ్గర స్టీల్ అండ్ ఐరన్‌పై పడింది. అక్కడ బాంబులు పేలుతున్నాయి, ఇక్కడ ధరలు ఒక్కసారిగా పెరిగి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రష్యా- ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో స్టీల్, ఐరన్ ధరలు భారీగా పెరిగాయి. ధనవంతుడి నుండి సామాన్యుడి వరకు భారీ భవనం కానీ చిన్న ఇళ్లు నిర్మించాలన్న స్టీల్, ఐరన్ తప్పనిసరి.
ఒకవైపు పెట్రోల్, డీజిల్ తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తుంటే.. తాజాగా స్టీల్ అండ్ ఐరన్ రేట్లు కూడా అటకెక్కాయి. దీంతో నిర్మాణాలు చేసుకునే వారు ఆందోళన చెందుతున్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పరిణామాల దృష్ట్యా స్టీల్ ట్రాన్స్ పోర్ట్ నిలిచిపోవడంతో ధరలు ఆకాశానంటాయి. గతంతో పోల్చుకుంటే స్టీల్ ధరలు భారీగా పెరిగాయంటున్నారు వ్యాపారులు.
ధరలు పెరగడంతో నిర్మాణాలు చేసుకునే వారు కూడా పనులను నిలిపి వేశారని తెలిపారు. దీంతో తమకు వ్యాపారాలు సాగడం లేదంటున్నారు. ఉక్రెయిన్ నుండి రవాణా నిలిచిపోవడంతో మేటీరియల్ రావడం లేదని.. దీంతో ఉన్న స్టాక్ కు డిమాండ్ పెరిగి ధరలు అటకెక్కాయని అంటున్నారు వ్యాపారులు. రష్యా-ఉక్రెయిన్ మధ్య పరిస్ధితులు చక్కబడితే కానీ మళ్లీ ధరలు తగ్గే అవకాశం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.