Sitaram Yechury: అత్యంత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్‎లో వెంటిలేటర్‌పై చికిత్స

Sitaram Yechury:సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఏచూరి వయస్సు 77 సంవత్సరాలు.

Update: 2024-09-06 03:08 GMT

Sitaram Yechury: అత్యంత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్‎లో వెంటిలేటర్‌పై చికిత్స

 Sitaram Yechury: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్‌ కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటిలేటర్‌పై ఆయన చికిత్స అందిస్తున్నారు వైద్యులు. వారం రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఏచూరి ఎయిమ్స్ లో చికిత్స పొందారు. తర్వాత డిశ్చార్జీ అయ్యారు. గురువారం రాత్రి మరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఊపిరితిత్తులలో సమస్య ఉందని వైద్యులు తెలిపారు. ఎయిమ్స్‌కు చెందిన వైద్యుల బృందం ఆయనకు చికిత్స చేస్తోంది.

ఆగస్టు 19న ఎయిమ్స్‌లో చేరారు:

ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్‌లో చేరారు. అనంతరం ఐసీయూకి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నరు. గురువారం ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించింది. న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ చికిత్స కోసం సీతారాం ఏచూరి ఆగస్టు నెలలో చేరారు. అయితే, ఎయిమ్స్ వైద్యులు ఆయన అస్వస్థతకు సంబంధించిన వివరాలను మాత్రం అప్పుడు వెల్లడించలేదు. కొన్ని నెలల క్రితమే ఏచూరికి కంటిశుక్లం శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుంచి ఎయిమ్స్‌ వైద్యుల బృందం ఆయనకు చికిత్స చేస్తోంది.



ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని ఇటీవల (ఆగస్టు 31) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ ఎయిమ్స్‌ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందం ఏచూరికి చికిత్స అందిస్తోంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నారని పార్టీ తెలిపింది.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News