ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పరిశోధన విద్యార్థులకి నెలకి 10,000 రూపాయలు..!

ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పరిశోధన విద్యార్థులకి నెలకి 10,000 రూపాయలు..!

Update: 2022-10-14 05:05 GMT

ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పరిశోధన విద్యార్థులకి నెలకి 10,000 రూపాయలు..!

Research Students: విద్యని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. ఇప్పటికే అందరికీ ఉచితంగా పాఠశాల విద్యను అందిస్తున్నాయి. అయితే ఉన్నత విద్యారంగంలో కూడా విద్యార్థులని ప్రోత్సహించేందుకు బహుమతులు, స్కాలర్‌షిప్‌లని ప్రవేశపెడుతున్నాయి. తాజాగా బీహార్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల పరిశోధన విద్యార్థుల కోసం నాలుగు కోట్ల 90 లక్షల 80 వేల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రకటన చేసింది. ఈ మొత్తం నుంచి ఒక్కో పరిశోధకుడికి నెలకు 10 వేలు అందుతాయి.

ఇప్పటి వరకు యూజీసీ నుంచి జేఆర్‌ఎఫ్‌లో అర్హత సాధించిన విద్యార్థులకే పరిశోధనలకు డబ్బు వచ్చేది. దీని వయోపరిమితిని 28 సంవత్సరాల వరకు ఉంటుంది. యుజిసి మార్గదర్శకాల ప్రకారం పిహెచ్‌డి, ఎంఫిల్ ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ముఖ్యమంత్రి ఫెలోషిప్ పథకం అందుతుంది. దీనిని ప్రభుత్వం ఆమోదించింది. 2016 యూజీసీ నిబంధనలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ, EWS విద్యార్థులకు, వయోపరిమితి 31 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు 5 సంవత్సరాల రిజర్వేషన్ కల్పించారు.

ఒక ఆర్థిక సంవత్సరంలో 400 మంది రీసెర్చ్ స్కాలర్‌లకు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫెలోషిప్ ఇవ్వనుంది. దీని కింద సైన్స్ ఫ్యాకల్టీ నుంచి 100 మంది, హ్యుమానిటీస్ ఫ్యాకల్టీ నుంచి 100 మంది, సోషల్ సైన్సెస్ నుంచి 100 మంది, కామర్స్, ఎడ్యుకేషన్, లా విభాగాల్లో 100 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ప్రభుత్వ నిబంధనల మేరకే రిజర్వేషన్ రూల్‌ను అనుసరిస్తారు.

UGC, CSIR, ICAR నుంచి లబ్ధి పొందని విద్యార్థులు ముఖ్యమంత్రి ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదే సమయంలో విశ్వవిద్యాలయం నుంచి ప్రీ-పిహెచ్‌డి అర్హత కలిగిన విద్యార్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు మూడేళ్లపాటు ప్రతి నెలా రూ.10,000 ఫెలోషిప్ చెల్లిస్తారు.

Tags:    

Similar News