Corona Vaccine: మార్చి 1 నుంచి రెండో దశ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం

Corona Vaccine: 60 ఏళ్ల వృద్ధులతో పాటు 45 ఏళ్ల కో-మార్బిడిటీస్‌ లకు టీకా

Update: 2021-02-27 04:16 GMT

Representational Image

Corona Vaccine: ప్రంట్ లైన్ వారియర్స్ కి మొదటి దశలో వాక్సిన్ పూర్తి చేసుకొని ఇక సామాన్యులకూ సైతం కరోనా టీకా అందనుంది. 60 సంవత్సరాలపైనున్న వృద్దులకు, 45 సంవత్సరాలపైన దీర్ఘకాలిక వ్యాదులు ఉన్న వారికి మార్చి 1 నుంచి రెండోవిడత వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి టీకాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.

రెండవదశలో కరోన పలు రాష్ట్రాల్లో విజృంబిస్తున్న నేపద్యంలో అందరి దృష్టి వ్యాక్సిన్ పైనే పడింది. ఇప్పటి వరకు వైద్య సిబ్బందికి, డాక్టర్లకు మొదటి దశలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. రెండవ దశలో వ్యాక్సిన్ లబ్ధిదారులు దేశవ్యాప్తంగా 27 కోట్ల మంది ఉంటారని అంచనా. అందులో దాదాపు 10 కోట్ల మంది 60 ఏళ్లు దాటిన వారే. 10 వేల ప్రభుత్వ టీకా కేంద్రాల్లో ఉచితంగా, 20 వేల ప్రైవేటు కేంద్రాల్లో చెల్లింపు పద్ధతిలో వ్యాక్సిన్‌ను అందించనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆదార్, పాన్ కార్డులతో పాటు ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుందని తెలిపారు.

తెలంగాణలో రెండవ దశలో దాదాపు 55 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు డైరక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాదులున్న 45 ఏళ్లకు పైబడిన వారు టీకా తీసుకోవడానికిగాను తమకు కో-మార్బిడిటీస్‌ ఉన్నాయని ధ్రువీకరించే ఆరోగ్య నివేదికల పత్రాలను చూపాల్సి ఉంటుంది. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీ వ్యాధులతో పాటు మధుమేహం, కేన్సర్‌, తీవ్ర ఆస్తమా, మానసిక రుగ్మతలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటాన్ని కో మార్బిడిటీ‌స్ గా పరిగణించే అవకాశం ఉంది. తెలంగాణలో దాదాపు 1500 సెంటర్లలో వ్యాక్సిన్ ఏర్పాటుకు సన్నాహలు చేస్తున్నారు.

ప్రస్తుతం వ్యాక్సిన్ వేసుకొవడానికి ఎంపిక చేసిన వర్గాల్లో భయం అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వ్యాక్సిన్ లతో పోల్చుకుంటే ఇండియాదే మేలైనదని కొనియాడారు. వ్యాక్సిన్ వేసుకునే వారు తగు జాగ్రత్తలు తీసుకొవాలని సూచించారు.

కరోన కేసులు పెరుగుతున్న నేపద్యంలో వ్యాక్సిన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య శ్రీ అనుమతి ఉన్న హస్పిటళ్లలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సెంటర్లను ప్రారంబించాల్సి ఉంది.

Tags:    

Similar News