మారటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీ భారం తగదన్న పిటిషనర్‌

మారటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీ భారం మోపడంపై సుప్రీంకోర్టు గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి సమాధానం కోరింది.

Update: 2020-06-04 09:29 GMT
Supreme Court (file Photo)

మారటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీ భారం మోపడంపై సుప్రీంకోర్టు గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి సమాధానం కోరింది. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆర్‌బీఐతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీనిపై తగిన వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ఈ విషయంలో రెండు అంశాలు పరిశీలనలో ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.. అవి.. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయకపోవడం, వడ్డీపై వడ్డీ విధించకపోవడం వంటి వాటిని పరిశీలించాలని కోరింది.

కస్టమర్లకు మారటోరియం వెసులుబాటు కల్పిస్తూనే మరోవైపు పేరుకుపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తున్నారని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన సర్వోన్నత న్యాయస్ధానం వ్యాఖ్యానించింది. గజేంద్ర శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది, ఆగ్రా నివాసి అయిన శర్మ, తాత్కాలిక వ్యవధిలో వడ్డీని వసూలు చేయకుండా రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కల్పించాలని ప్రభుత్వానికి మరియు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) అడిగారు. అయితే బ్యాంకుల ఆర్థిక సాధ్యతను పణంగా పెట్టి "బలవంతంగా వడ్డీని వదులుకోవడం" కోసం వెళ్ళడం వివేకం కాదని ఆర్బిఐ తెలిపింది. ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు అఫిడవిట్‌ దాఖలుకు కొంత సమయం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.


Tags:    

Similar News