Alert: రేషన్‌కార్డు దారులకి అలర్ట్.. ఈ పనిచేయకపోతే రేషన్ కట్..!
Alert: రేషన్‌కార్డు దారులు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే రేషన్ కట్ అయ్యే ప్రమాదం ఉంది.
Alert: రేషన్‌కార్డు దారులు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే రేషన్ కట్ అయ్యే ప్రమాదం ఉంది.'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్'పై ప్రభుత్వం తరపున పని జరుగుతోంది. దీని కింద మీరు ఏ రాష్ట్రంలోనైనా ఏ దుకాణం నుంచి అయినా రేషన్ పొందగలరు. ఇందుకోసం లబ్ధిదారులు తమ రేషన్‌కార్డు, ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.
జూన్ 30 వరకు గడువు పొడిగించారు
మీరు ఇంకా మీ రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకుంటే భవిష్యత్తులో సమస్యలు ఎదురవొచ్చు. అందుకే ముందుగానే అందరు ఆధార్, రేషన్‌ను లింక్ చేయడం అవసరం. దీనికి ముందుగా ప్రభుత్వం మార్చి 31 వరకు గడువు విధించింది. అయితే ఇప్పుడు ఆధార్‌ను లింక్ చేసే తేదీని జూన్ 30 వరకు పొడిగించారు.
'వన్ నేషన్, వన్ కార్డ్'ని లక్షల మంది ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు తక్కువ ధరకే రేషన్ అందడమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు లభిస్తాయి. 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. దీని కింద లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. మీరు రేషన్ కార్డ్‌తో ఆధార్‌ను లింక్ చేయడం ద్వారా 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకం ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.
రేషన్ కార్డును ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి..?
1. ముందుగా ఆధార్ వెబ్‌సైట్ uidai.gov.inకి వెళ్లండి.
2. అక్కడ 'Start Now'పై క్లిక్ చేయండి.
3. మీ చిరునామా, జిల్లా తదితర వివరాలను అందించండి.
4. తర్వాత 'రేషన్ కార్డ్ బెనిఫిట్' ఎంపికపై క్లిక్ చేయండి.
5. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, ఈ-మెయిల్ చిరునామా, మొబైల్ నంబర్ మొదలైనవి ఎంటర్ చేయండి.
6. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది.
7. మీరు OTPని నింపిన వెంటనే మీ స్క్రీన్‌పై ప్రక్రియ పూర్తయినట్లు మెస్సేజ్ వస్తుంది.
చదవండి:
Ration Card: మీకు కొత్తగా పెళ్లయిందా.. రేషన్‌కార్డుని ఇలా అప్‌డేట్ చేసుకోండి..!