శ్రామిక్ రైళ్లలో 97 మంది వలస కార్మికులు మృతి..
అంటువ్యాధి సవరణ బిల్లు 2020కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శనివారం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు..
అంటువ్యాధి సవరణ బిల్లు 2020కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శనివారం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అంటువ్యాధి సమయంలో దేశంలోని వైద్యులు, నర్సులు, ఆశా కార్మికుల రక్షణ కోసం ఈ బిల్లు వీలు కల్పిస్తుంది, వీరిపై దాడి చేసిన వారికి పలు రకాల శిక్షలు పడతాయి.
ఇందులో కేంద్ర ప్రభుత్వం 123 సంవత్సరాల నాటి చట్టానికి మార్పులు చేసింది. దీని కింద వైద్యులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలపై దాడి చేసేవారికి గరిష్టంగా 7 సంవత్సరాల శిక్ష విధించనుంది న్యాయస్థానం. అలాగే 50 వేల నుంచి 2 లక్షల జరిమానా విధించే నిబంధన కూడా ఉంది. ఇది కాకుండా, 3 నెలల నుండి 5 సంవత్సరాల వరకు శిక్ష కూడా ఉండవచ్చు. తీవ్రమైన గాయాల విషయంలో గరిష్టంగా 7 సంవత్సరాల శిక్ష పడనుంది.
అలాగే లాక్డౌన్ సమయంలో నడుస్తున్న ప్రత్యేక రైళ్ళలో ప్రయాణించే సమయంలో 97 మంది వలస కార్మికులు మరణించారని కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్వీకరించామని గోయల్ తెలిపారు.