ఖాట్మండు నైట్ క్లబ్ లో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ
*నైట్ క్లబ్‌లో మ్యూజిక్ వింటూ సేదదీరుతున్న రాహుల్
Rahul Gandhi: ఆయన ప్రధాన ప్రతిపక్షానికి ముఖ్యనాయకుడు. 136 ఏళ్ల ఘన చరిత్ర వహించిన కాంగ్రెస్ పార్టీకి కీలక నేత. గాంధీ కుటుంబ వారసుడు. ఆయనలో మాత్రం రాజకీయనాయకుడికి ఉండాల్సిన లక్షణాలు మాత్రం అసలే లేవనిపిస్తోంది. ఓవైపు ప్రధాని మోడీ యూరప్ లో పర్యటిస్తూ దేశ వారసత్వాన్ని కాపాడుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీపై గత లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన స్మృతి ఇరానీ అమేధీలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.
కానీ గాంధీ ఫ్యామిలీ వారసుడు రాహుల్ గాంధీ మాత్రం పార్టీల్లో మునిగితేలుతున్నారు. నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ మ్యూజిక్ వింటూ సేదదీరుతున్నారు. తాజా ఘటనతో రాహుల్ అసలు రియల్ పొలిటీషియన్ కాదన్న వర్షన్ విన్పిస్తోంది. రాజకీయాలంటే రాహుల్కు తమాషా అని రుజవయ్యిందంటున్నారు బీజేపీ నేతలు. రాహుల్ విదేశీ సంస్కృతి రుజువవుతుందని దుయ్యబట్టింది. రాహుల్ గాంధీలో సీరియస్ పొలిటీషియన్ అన్న జాడే లేదంటూ ధ్వజమెత్తింది బీజేపీ.
ఓవైపు పార్టీలో గందరగోళం నెలకొన్న తరుణంలో రాహుల్ మాత్రం పార్టీల్లో మునిగితేలుతున్నారు. రాజకీయాలపై రాహుల్ కపటం రుజవైందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. మొత్తం వీడియో ద్వారా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత నిజస్వరూపం బయటపడిందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నేపాల్ లో ఐదు రోజుల విడిది కోసం వెళ్లిన రాహుల్ క్లబ్బుల్లో సేదదీరడంపై విపక్షాలు సైటర్లు వేస్తున్నాయ్. నేపాల్ స్నేహితుడు వివాహానికి కాట్మండు వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడ క్లబ్బుల్లో దర్శనమివ్వడం అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ తలలుపట్టుకుంటోంది.