Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా ఎప్పుడు ప్రారంభం? స్నానాల తేదీలు ఎప్పుడు?

Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా వచ్చే ఏడాది 2025లో నిర్వహిస్తారు. ప్రతి 12ఏళ్లకు ఒకసారి ఈ మహాకుంభమేళాను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మహాకుంభం ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయాలను తెలుసుకుందాం.

Update: 2024-11-07 04:18 GMT

Maha Kumbh Mela 2025: హిందూమతంలో కుంభమేళా అంటే ఎంతో ప్రాముఖ్యత ఉంది. కుంభమేళా ప్రతి మూడేళ్లకు ఒకసారి జరుగుతుంది. అర్థకుంభమేళా అనేది ప్రతి 6ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ప్రతి 12ఏళ్లకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తుంటారు. 2025లో ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా నిర్వహిస్తారు. ఇక్కడే కాకుండా హరిద్వార్, నాసిక్, ఉజ్జయినీలోనూ కుంభమేళాను నిర్వహిస్తారు.

2025లో జరిగే మహాకుంభమేళా జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్ రాజ్ లో ప్రారంభం కానుంది. ఈ ఏడాది మహాకుంభం మొదటి రోజు సిద్ధియోగం ఏర్పడటం కూడా చాలా యాదృశ్చికంగా జరుగుతోందని పండితులు చెబుతున్నారు. మహాకుంభమేళా హిందూ మతంలో వచ్చే అతిపెద్ద పండగ. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ కుంభమేళకు హాజరవుతుంటారు. జనవరి 13వ తేదీ ఫిబ్రవరి 26వ తేదీ వరకు మహా కుంభమేళాను నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ప్రారంభించారు.

స్నానాల తేదీలు ఇవే:

13 జనవరి 2025- పుష్య పూర్ణిమ

14 జనవరి 2025- మకర సంక్రాంతి

29 జనవరి 2025 - మౌని అమావాస్య

3 ఫిబ్రవరి 2025- వసంత పంచమి

4 ఫిబ్రవరి 2025- అచల నవమి

12 ఫిబ్రవరి 2025- మాఘ పూర్ణిమ

26 ఫిబ్రవరి 2025- మహా శివరాత్రి

Tags:    

Similar News