భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. PSLV సిరీస్ విజయాల్లో ఏకంగా హాఫ్ సెంచరీ కొట్టింది. PSLV–సీ50 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. PSLV–సీ50 రాకెట్ ద్వారా CMS-01 శాటిలైట్‌ను నింగిలోకి పంపింది. సీఎంఎస్-01 శాటిలైట్ ఏడేళ్లపాటు సేవలు అందించనుంది. అంతేకాదు, సీఎంఎస్-01 శాటిలైట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి రానుంది. అలాగే, సీ-బ్యాండ్ సేవల విస్తరణకు ఉపయోగపడనుంది.
షార్ నుంచి ఇది 77వ మిషన్ కాగా, PSLV సిరీస్‌లో ఇది 52వ ప్రయోగం. అలాగే, ఇస్రో ప్రయోగించిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం. PSLV – సీ50 ప్రయోగం విజయవంతం కావడంతో భారత సాంకేతిక వ్యవస్థ మరింత వేగవంతం కానుంది. అలాగే, అత్యాధునిక సాంకేతిక సమాచార వ్యవస్థ మన సొంతం కానుంది.