IPL 2021 Matches: ఐపీఎల్ కోసం ఖైదీల నిరాహార దీక్ష
IPL 2021 Matches: ఒక జైలులోని ఖైదీలు ఐపీఎల్ మ్యాచ్ లు చూడకపోతే ముద్దకూడా ముట్టం అని భీష్మించారు.
IPL 2021 Matches: ఐపీఎల్ ఫీవర్ ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్ని పట్టి కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక జైలులోని ఖైదీలు ఐపీఎల్ మ్యాచ్ లు చూడకపోతే ముద్దకూడా ముట్టం అని భీష్మించారు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుందా ఉత్తర ప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లో ని ఓ జైలులో జరిగింది. క్రికెట్ మ్యాచ్ లు స్టేడియంలోనే చూడక్కర్లేదు.. ఇంట్లో కూచుని చూడొచ్చు అనే పాయింట్ మీద ప్రత్యక్ష ప్రేక్షకులు లేకుండా..ప్రత్యక్ష ప్రసారంతో ఐపీఎల్ అదరగొట్టేస్తోంది. దానికి ప్రధాన కారణం కరోనా కూడా తోడయ్యింది. ఐపీఎల్ టీవీలో వస్తుందంటే ఆ సమయానికి ఎన్నిపనులున్నా వాయిదా వేసుకుని మరీ టీవీల ముందు అతుక్కుపోయేవారు ఎందరో ఉన్నారు. ఐపీఎల్ మ్యాచ్ సమయాల్లో వినోద కార్యక్రమాలను కూడా పక్కన పెట్టేస్తారు.. అభిమానులు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ఐపీఎల్ ఫీవర్ ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్ని పట్టి కుదిపేస్తోంది.
ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లో ఓ జైలులో ఈ సంఘటన చోటు చేసుకుంది. తమకు ఐపీఎల్ మ్యాచ్ లు చూసేలా అవకాశం ఇవ్వాలని కోరుతూ ఫతేగడ్ కేంద్ర కారాగారంలో ఖైదీలు నిరాహార దీక్షకు దిగడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ జైలు సూపరింటెండెంట్ ప్రహ్లాద్ శుక్లా ఆ సమయంలో లక్నోలో అధికారులతో సమావేశంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఆయన పరుగున జైలు వద్దకు చేరుకున్నారు. ఖైదీలతో చర్చలు జరిపారు. మొత్తమ్మీద వారితో జరిగిన చర్చల్లో ఒక పరిష్కారం దొరికింది. ఖైదీల డిమాండ్లకు జైలు అధికారులు అంగీకరించారు. దీంతో ఖైదీలు తమ దీక్షను విరమించారు. ఖైదీలు మనుషులే. వారికీ కోరికలు ఉంటాయి. వారి డిమాండ్ లు కూడా పరిష్కరించాల్సిందే. ఒక్క జైలు నిబంధనలు అతిక్రమించనంత వరకూ.. వారి ప్రవర్తనలో ఇబ్బందికర అంశాలు లేనంత వరకూ వారి హక్కులకు ఏమాత్రం భంగం కలగకుండా చూసుకోవలసిన బాధ్యత జైలు అధికారులదే.