Modi: కాంగ్రెస్, ఖర్గేపై ప్రధాని మోడీ సెటైర్లు
Modi: కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది
Modi: రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కేవలం తమ కుటుంబ సభ్యులకు మాత్రమే భారతరత్న ఇచ్చే ప్రయత్నం చేసిందన్నారు. రాహుల్ గాంధీని స్టార్టప్‌గా కాంగ్రెస్ పార్టీ ఉపయోగిస్తే.. ఆయన నాన్ స్టార్టర్‌గా మారారని మోడీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మొదటినుంచి ఎస్సీ,ఎస్టీ, బీసీలకు వ్యతిరేకమైన పార్టీ అన్న ప్రధాని.. వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా నెహ్రూ అంగీకరించలేదని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకొని పోతుందని.. త్వరలోనే మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.