NTR Coin: నేడు రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణ
NTR Coin: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు
NTR Coin: ఎన్టీఆర్ పేరిట వంద రూపాయల వెండి నాణేన్ని కేంద్ర ప్రభుత్వం ముద్రించింది. ఎన్టీఆర్ గౌరవార్థం శత జయంతిని పురస్కరించుకుని మోడీ సర్కార్ ఈ నాణేన్ని ముద్రించింది. ఈ స్మారక నాణేన్ని ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేయనున్నారు. ఉదయం రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
నాణెం విడుదల కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఇక సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసిన సన్నిహితులు హాజరవుతారు. దాదాపుగా 200 మంది అతిథులు హాజరుకానున్నారు.