Covid-19 Vaccine: టీకా వేయించుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్
Covid-19 Vaccine: దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లన్నీ సురక్షితమైనవేనని కేంద్రం స్పష్టం చేసింది.
Covid-19 Vaccine: దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లన్నీ సురక్షితమైనవేనని కేంద్రం స్పష్టం చేసింది. కోవిడ్ వల్ల సంభవిస్తున్న మరణాలతో పోలిస్తే.. వ్యాక్సినేషన్ తర్వాత మరణాల ముప్పు నామమాత్రమేనని పేర్కొంది. టీకాల కారణంగా ప్రతికూల ప్రభావం అత్యల్పస్థాయిలో ఉన్నట్టు కేంద్రారోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశంలో జనవరి 16 నుంచి జూన్ 7 మధ్య 23.5 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చినట్టు పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ అనంతర పరిణామాల్లో మరణాల రేటు ఇచ్చిన డోసులను బట్టి చూస్తే 0.0002 శాతం మాత్రమే ఉందిని స్పష్టం చేశారు. ప్రస్తుతం కోవిడ్ మరణాల రేటు 1శాతం మించి ఉందని వెల్లడించారు. వ్యాక్సిన్లు తీసుకుంటే ఆ మరణాలను తగ్గించవచ్చన్నారు.
మరోవైపు.. దేశంలో కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత తీవ్ర అలర్జీల ప్రభావంతో తొలి మరణం సంభవించినట్టు కేంద్ర ప్రభుత్వ అధ్యయన బృందం పేర్కొంది. 68 ఏళ్ల వ్యక్తి ఒకరు మార్చి 8న టీకా తీసుకున్న తర్వాత తీవ్ర అలర్జీల ప్రభావంతో చనిపోయినట్లు ఏఈఎఫ్‌ఐ కమిటీ నివేదికలో తెలిపింది.
మరోవైపు.. టీకా వేయించుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. కోవిడ్ టీకా తీసుకోవడానికి ఇకపై ముందుగా రిజిస్ట్రేషన్ లేదంటే అపాయింట్‌మెంట్ అక్కర్లేదని పేర్కొంది. 18 ఏళ్లు దాటిన వారు నేరుగా సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా వేయించుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేటర్లు అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసి, టీకా వేస్తారని తెలిపింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, అపాయింట్‌మెంట్ వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ నేపథ్యంలో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది.
ఇకపై వాకిన్ విధానంలో టీకా వేయించుకోవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా కొవిన్ పోర్టల్‌లో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. 1075 హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేస్తారని పేర్కొంది. ఈ పద్దతులు కేవలం గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసమని కేంద్రం స్పష్టం చేసింది.