Post Office: హోమ్ లోన్ సేవలను ప్రారంభించిన పోస్టాఫీస్.. ఎలా అప్లై చేయాలి..
Post Office: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) , HDFC లిమిటెడ్ కలిసి వినియోగదారులకు గృహ రుణాలను అందించడానికి సిద్దమయ్యాయి.
Post Office: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) , HDFC లిమిటెడ్ కలిసి వినియోగదారులకు గృహ రుణాలను అందించడానికి సిద్దమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు హెచ్‌డిఎఫ్‌సి హోమ్ లోన్ ఉత్పత్తులను అందించడానికి ఇండియా పోస్ట్ పనిచేయనుంది. తన 650 బ్రాంచ్‌లు, 1,36,000 పైగా బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్ల నెట్‌వర్క్‌ను ఉపయోగించనుంది. ఈ భాగస్వామ్యం హెచ్‌డిఎఫ్‌సి హోమ్ లోన్ ఉత్పత్తులను తక్కువ బ్యాంకింగ్ సేవలున్న ప్రాంతాలకు విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుందని ఐపిపిబి తెలిపింది. వీరిలో చాలా మంది, ఫైనాన్స్‌కు తక్కువ లేదా యాక్సెస్ లేకుండా, సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చు.
1.90 లక్షల బ్యాంకింగ్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి హోమ్ లోన్ ఆఫర్లు
IPPB దాదాపు 1,90,000 బ్యాంకింగ్ సర్వీస్ ప్రొవైడర్లు- పోస్ట్‌మెన్ , గ్రామీణ డాక్ సేవకుల ద్వారా గృహ రుణాలను అందజేస్తుందని కంపెనీ తెలిపింది. ఒప్పందం ప్రకారం.. అన్ని గృహ రుణాల కోసం క్రెడిట్, సాంకేతిక, చట్టపరమైన మూల్యాంకనం, ప్రాసెసింగ్, పంపిణీని HDFC లిమిటెడ్ నిర్వహిస్తుంది. అయితే IPPB రుణాన్ని సోర్సింగ్ చేయడానికి బాధ్యత వహిస్తుందని కంపెనీ పేర్కొంది.
IPPB అధికారి ఒకరు మాట్లాడుతూ..పేద ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే రుణాలు పొందడం చాలా అవసరం. ఏ బ్యాంకు కానీ ఆర్థిక సంస్థ కానీ ఖాతాదారులకు చౌకైన గృహ రుణాలను అందించదు. అందుకోసం IPPB, HDFC లిమిటెడ్ జతకట్టాయి. మారుమూల గ్రామాలకు చెందిన వారికి చౌకైన గృహ రుణాలను మంజూరు చేయడమే లక్ష్యం. హెచ్‌డిఎఫ్‌సి మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దార్శనికతకు అనుగుణంగా అందరికీ అందుబాటు ధరలో ఇళ్లు అందించే దిశగా ముందుకు వెళుతామని తెలిపారు.
IPPB ప్రారంభం నుంచి విశిష్టమైన బ్యాంకింగ్ ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. వివిధ విభాగాలలో వినియోగదారులకు సేవలను అందిస్తోంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడం, వర్చువల్ డెబిట్ కార్డ్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ సర్వీస్ మొదలైన సేవలను అందిస్తోంది.