PM Vishwakarma Yojana: ఏ గ్యారెంటీ లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 3 లక్షల రుణం పొందే బంపర్ ఛాన్స్..!
PM Vishwakarma Yojana Benefits: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను పేద, మధ్య తరగతి ప్రజల కోసం ప్రారంభిస్తోంది. అయితే, ప్రధానంగా కళాకారుల కోసం కూడా కొన్ని ప్రత్యేక పథకాలు అందుబాటులో ఉన్నాయి.

PM Vishwakarma Yojana: ఏ గ్యారెంటీ లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 3 లక్షల రుణం పొందే బంపర్ ఛాన్స్..!
PM Vishwakarma Yojana Benefits: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం విశ్వకర్మ యోజన (PM Vishwakarma Yojana) ద్వారా రూ.3 లక్షల వరకు రుణ సదుపాయం పొందే అవకాశం ఉంది. దీనిపై 5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనికి ఎలాంటి హామీ లేకుండా సులభంగా ఈ పథకం నుంచి రూ.3 లక్షలు పొందవచ్చు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
పీఎం విశ్వకర్మ యోజన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం నైపుణ్యం కలిగిన కళాకారుల కోసం అందిస్తోంది. సాంప్రదాయం మన కళాకారుల వృత్తికి చేయూతను అందించడానికి రుణాలను మంజూరు చేస్తుంది. దీంతో సంప్రదాయబద్ధంగా వచ్చే తమ కళను కాపాడుతూ,వ్యాపారం చేసి ఆర్థిక లాభాలు పొందవచ్చు.
పీఎం విశ్వకర్మ యోజన 18 సంప్రదాయ వృత్తులకు అందుబాటులో ఉంది. అయితే వీళ్ళు ఇదివరకే పీఎం స్వనిధి యోజన, పిఎంఈజీపీ, ముద్ర యోజనలో గత ఐదేళ్లలో దరఖాస్తు చేసుకొని ఉండకూడదు. కుటుంబంలో కేవలం ఒకరు మాత్రమే అర్హులు.
పీఎం విశ్వకర్మ యోజన రెండు దఫాలో డబ్బులను జమ చేస్తారు. మొదటగా ఒక లక్ష జమ చేస్తారు. ఆ తర్వాత రెండు లక్షలను లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. దీనికి 5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి గ్యారెంటీ లేకుండా సులభంగా రుణం పొందవచ్చు. అంతేకాదు ఒక్కో ట్రాన్సాక్షన్‌కు ఒక రూపాయి రివార్డు కూడా అందిస్తారు. ఒక నెలలో వంద వరకు ట్రాన్సాక్షన్లు చేయవచ్చు.
పీఎం విశ్వకర్మ యోజనకు మీరు కూడా రిజిస్టర్ చేయాలంటే www.pmvishwakarma.gov.in అధికారిక వెబ్‌సైట్లో ప్రిక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. దీనికి మొబైల్ నెంబర్, ఆధార్ వెరిఫికేషన్ వంటివి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం మూడు స్టెప్పుల్లో వెరిఫికేషన్ ఉంటుంది. లోకల్ వెరిఫికేషన్, జిల్లా స్థాయి, ఫైనల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ స్క్రీన్ కమిటీ నిర్వహిస్తుంది. లబ్ధిదారులకు ఏదైనా సందేహం ఉంటే 1800267777 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా 17923 నెంబర్ కూడా కాల్ చేయవచ్చు.