Pamban Bridge: రామసేతు రిపీట్? దటీజ్ మోదీ.. శ్రీలంకలో కొత్త చరిత్ర సృష్టించిన ఇండియా

Pamban Bridge: ఇది కేవలం ఒక రైలు వంతెన మాత్రమే కాదు. ఇది భారతదేశ టెక్నాలజీ సామర్థ్యాన్ని, పాత చరిత్రను గౌరవించడాన్ని, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండే దిశగా ముందడుగు వేయడాన్ని ప్రతిబింబిస్తోంది.

Update: 2025-04-06 12:06 GMT
Pamban Bridge

Pamban Bridge: రామసేతు రిపీట్? దటీజ్ మోదీ.. శ్రీలంకలో కొత్త చరిత్ర సృష్టించిన ఇండియా

  • whatsapp icon

Pamban Bridge: రామ నవమి సందర్బంగా ప్రధాని మోదీ తమిళనాడులో భారతదేశపు మొట్టమొదటి వెర్టికల్ లిఫ్ట్ సముద్ర రైలు వంతెనను దేశానికి అంకితం చేశారు. ఈ వంతెన రామేశ్వరం దగ్గర పాంబన్ ప్రాంతంలో నిర్మించారు. మొత్తం రూ.550 కోట్ల వ్యయంతో పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌కి పాంబన్ బ్రిడ్జ్ అనే పేరు ఉంది. రామాయణ కాలానికి చరిత్రతో ముడిపడి ఉన్న ఈ ప్రాంతం, రామ సేతు నిర్మాణానికి కేంద్ర బిందువుగా పరిగణిస్తారు.

రామేశ్వరం ద్వీపాన్ని భూభాగంతో అనుసంధానించే ఈ వంతెన పొడవు సుమారు 2.08 కిలోమీటర్లు. దీనిలో 99 స్పాన్‌లు ఉండగా, 72.5 మీటర్ల వెడల్పుతో ఉండే లిఫ్ట్ స్పాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది 17 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ అయ్యే విధంగా రూపకల్పన చేయబడింది. దీంతో సముద్రంలో వెళ్లే పెద్ద షిప్‌లు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్తూ ఉండగలుగుతాయి, అదే సమయంలో రైళ్ల రాకపోకలు కూడా నిరవధికంగా కొనసాగుతాయి.

ఈ బ్రిడ్జ్ పూర్తిగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేస్తారు. దీనిలో స్టెయిన్‌లెస్ స్టీల్ బార్లు, తుపానులను తట్టుకునే పైనింగ్, మొత్తం వెల్డింగ్ చేసిన జాయింట్లు, డ్యుయల్ ట్రాక్‌కు అనుగుణంగా ఏర్పాట్లు ఉన్నాయి. సముద్ర తేమ వల్ల వచ్చే నష్టం నివారించేందుకు స్పెషల్ పాలిసిలోక్సేన్ కంటింగ్‌తో ఇది కవరింగ్ చేస్తారు.

ఇదివరకు 1914లో బ్రిటీష్ ఇంజినీర్లచే నిర్మితమైన పాత పాంబన్ బ్రిడ్జ్, శతాబ్దానికి పైగా రామేశ్వరం వెళ్లే భక్తులకు, వ్యాపారస్తులకు ముఖ్య మార్గంగా ఉపయోగపడింది. కానీ కాలక్రమేణా వృద్ధాప్యంలోకి జారిన ఆ వంతెనకు ప్రత్యామ్నాయంగా కొత్త వంతెన నిర్మించాలని కేంద్రం 2019లో నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టును రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న సంస్థ అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) చేపట్టింది. పాక్ స్ట్రెయిట్‌లో ఎప్పుడూ ఉధృతంగా ఉండే గాలులు, సముద్రం నుంచి వచ్చే ఒత్తిళ్లు, పర్యావరణ పరిమితులు లాంటి ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఈ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేసింది.



Tags:    

Similar News