Nagpur: మెట్రోని ప్రారంభించి.. సామాన్య ప్రయాణికుడిలా టికెట్ కొనుగోలు చేసిన మోదీ

Nagpur: పాల్గొన్న కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం ఏక్‎నాథ్ షిండే

Update: 2022-12-11 10:22 GMT

Nagpur: మెట్రోని ప్రారంభించి.. సామాన్య ప్రయాణికుడిలా టికెట్ కొనుగోలు చేసిన మోదీ

Nagpur: దేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్దే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మహారాష్ట్ర, నాగ్‎పూర్ లలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా నాగ్‎పూర్ నుంచి ఛత్తీస్‎గడ్ లోని బిలాస్‎పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తోపాటు నాగ్ పూర్ మెట్రో ఫేస్ -1ను ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు. ఈసందర్భంగా స్వయంగా టికెట్ కొని ఫ్రీడమ్ పార్క్ నుంచి ఖాప్రి వరకు విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. ఆతర్వాత 6వేల700 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మెట్రో రెండవ దశ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. కాగా ఇది దేశంలో అందుబాటులోకి వచ్చిన ఆరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు. ఈ వందే భారత్ ట్రైన్ గరిష్ట స్పీడ్ గంటకు 160 కిలోమీటర్లని రైల్వే అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News