ఈకాలం పిల్లలకి చేతిలో ఫోన్ ఉంటే చాలు ఇంకేం అక్కరలేదు. మనం ఎం చెప్పిన వినరు. ఎప్పుడు ఫోన్ తోనే ఉంటారు. దీనివల్ల మనషి ఆరోగ్యం కూడా పాడవుతుందని పలువురు వైద్యులు కూడా చెబుతున్నారు. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు.. మొబైల్ వాడకం మరింతగా పెరిగిపోయింది. అయితే దీనిపైన ఎలా అయిన ద్రుష్టిపెట్టాలని అనుకుంది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ గురువారం సర్క్యులర్ జారీచేసింది... అయితే ఇది కేవలం విద్యార్దులకి మాత్రమే కాదని అధ్యాపకులకి కూడా అని వర్తిస్తుందని చెప్పుకొచ్చింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది... మొబైల్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాకపోయిన కొంతలో కొంత తగ్గించిన వాళ్ళమీ అవుతామని చెప్పుకొచ్చింది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం.. గతంలో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమైన సభలకి సమావేశాలకి ఫోన్స్ తీసుకురావద్దని ఆదేశించిన సంగతి తెలిసిందే..