Coronavirus: ఒక్కరితో 400 మందికి పైగా వైరస్.. భౌతికదూరమే పరిష్కారం

Coronavirus: సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంది. రోజు రోజుకు కేసులు అధికమవుతుండడం కొంత ఆందోళన కలిగించే అంశమే.

Update: 2021-04-27 01:14 GMT

భౌతికదూరం (ఫొటో ట్విట్టర్)

Coronavirus: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంది. రోజు రోజుకు కేసులు అధికమవుతుండడం కొంత ఆందోళన కలిగించే అంశమే. ఇలాంటి విపత్కర పరిస్థితులను కేవలం మాస్క్, బౌతిక దూరంతోనే ఎదుర్కొగలమని డాక్టర్లు, కేంద్రప్రభుత్వం తెలియజేస్తున్న విషయం తెలిసిందే. లేకుంటే మరిన్ని దారుణ పరిస్థితులు ఎదురుకానున్నాయని తెలుస్తోంది.

ఈమేరకు కోవిడ్ నిబంధనలు సక్రమంగా పాటించకపోతే ఒకరి ద్వారా నెల రోజుల వ్యవధిలో 406 మందికి కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని పరిశోధనలో తేలినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, భౌతిక దూరం, కోవిడ్ రూల్స్ 50 శాతం పాటించినా.. ఆ సంఖ్య 15కి తగ్గిపోతుందంట. ఒకవేళ 75శాతం నిబంధనలు పాటిస్తే కేవలం 3కి మాత్రమే వైరస్ సోకుతుందని పేర్కొంది.

కోవిడ్ రూల్స్ కచ్చితంగా అందరూ పాటించాలి. లేదంటే ప్రమాదంలో చిక్కుకున్నట్లేనని ప్రభుత్వం వెల్లడిస్తోంది. మాస్కులు, శానిటైజర్లు కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను మాత్రమే తగ్గిస్తాయి. భౌతిక దూరమే కరోనా వైరస్ నియంత్రణకు ముఖ్యమని పేర్కొంది. దీనిని అందరూ అర్థం చేసుకోవాలని, కోవిడ్ నియంత్రణకు సహకరించాలని కోరింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని స్పష్టం చేసింది. 

Tags:    

Similar News