African swine fever: కేరళలో మరోసారి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్..310 పందులను చంపిన అధికారులు

African swine fever:కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం రేపింది. ఈ వైరస్ సోకిన 310 పందులను చంపినట్లు అధికారులు తెలిపారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.

Update: 2024-07-08 00:23 GMT

African swine fever: కేరళలో మరోసారి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్..310 పందులను చంపిన అధికారులు

African swine fever:ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) కారణంగా కేరళలోని త్రిసూర్ జిల్లాలో దాదాపు 310 పందులను చంపినట్లు కేంద్రం ఆదివారం వెల్లడించింది. మడక్కతరన్ పంచాయతీలో ఈ మహమ్మారి కనిపించడంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వెంటనే చర్యలు చేపట్టింది. జూలై 5న ఈ ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిలో పందులను చంపేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను నియమించామని, అప్పటి నుంచి 310 పందులను చంపినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మే 2020లో ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లలో మొదటిసారిగా వెలుగులోకి వచ్చిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ను నిర్మూలించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాణాంతక వ్యాధి దేశవ్యాప్తంగా దాదాపు 24 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాపించింది. "యాక్షన్ ప్లాన్ ప్రకారం, ప్రభావిత ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో మరింత నిఘా నిర్వహించాలి" అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ASF మనుషులకు వ్యాపించదు' అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ, ASF కోసం వ్యాక్సిన్ లేకపోవడం జంతు వ్యాధులను నిర్వహించడంలో సవాళ్లను హైలైట్ చేస్తుంది.'జూనోటిక్ , నాన్-జూనోటిక్ వ్యాధుల మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యమని అధికారులు తెలిపారు. జంతువుల వల్ల కలిగే అనేక వ్యాధులు నోటి వ్యాధి లేదా లంపి చర్మ వ్యాధి వంటివి మానవులకు సోకవని వెల్లడించింది. అయితే ఈ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని తెలిపింది.

కేరళలోని త్రిసూర్ జిల్లాలోని ఒక గ్రామంలో 'ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్' వ్యాప్తి చెందిన కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం అధికారులు సమాచారం అందించారు. 'ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్' అనేది పెంపుడు, అడవి పందులను ప్రభావితం చేసే ప్రాణాంతక అంటు వ్యాధి. ఇది సోకిన పంది శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఒక పంది నుండి మరొక పందికి సులభంగా వ్యాపిస్తుంది.

Tags:    

Similar News