CUET-UG: ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి జూలై 15-19 మధ్య మళ్లీ పరీక్ష

CUET-UG:కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు CUET-UG పరీక్షకు సంబంధించి అభ్యర్థులు లేవనెత్తే ఫిర్యాదులు సరైనవైతే వారికి జులై 15 నుంచి 19 మధ్య కాలంలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ఎన్టీఏ వెల్లడించింది.

Update: 2024-07-08 00:34 GMT

CUET-UG: ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి జూలై 15-19 మధ్య మళ్లీ పరీక్ష

CUET-UG:కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు CUET-UG పరీక్షకు సంబంధించి అభ్యర్థులు లేవనెత్తే ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి జులై 15 నుంచి 19వ తేదీల్లో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ఎన్టీఏ వెల్లడించింది. పలు సాంకేతిక సమస్యలు, పరీక్షా సమయం కోల్పోవడం వంటి ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు యూజీ ప్రవేశపరీక్ష కీ రిలీజ్ చేసిన ఎన్టీఏ జులై 9లోగా అభ్యంతరాలు తెలియజేయాలని అభ్యర్థులకు సూచించింది.

మే 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రధాన నగరాల్లో పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13.48 లక్షల మంది హాజరయ్యారు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు జులై 9వ తేదీలోగా ఆన్ లైన్ ద్వారా తెలియజేయాలని ఎన్టీఏ వెల్లడించింది. అయితే పరీక్షకు సంబంధించి జున్ 30తేదీలోగా వచ్చిన ఫిర్యాదులను పరిగణలోనికి తీసుకుంటామని తెలిపింది. వీటిపై నిపుణుల బ్రుందం నిర్ణయం తీసుకుంటుందని అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులు నిజమైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామంటూ పేర్కొంది. 

Tags:    

Similar News