UGC NET 2024: యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలను ప్రకటించిన NTA

UGC NET 2024: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ UGC NET జూన్ 2024 పరీక్ష తేదీలను ప్రకటించింది.NCET 2024,జాయింట్ CSIR UGC NET పరీక్ష తేదీలు కూడా ప్రకటించింది. ఈ సారి పేపర్ పెన్ను విధానంలో కాకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది.

Update: 2024-06-29 01:03 GMT

UGC NET 2024: యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలను ప్రకటించిన NTA

UGC NET 2024: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే UGC NET పరీక్ష కోసం కొత్త తేదీలను ప్రకటించింది. NCET 2024 పరీక్ష జూలై 10న జరుగుతుందని ఎన్టీఏ వెల్లడించింది. ఉమ్మడి CSIR UGC NET జూలై 25 నుండి 27 వరకు నిర్వహించనున్నారు. UGC NET జూన్ 2024 పరీక్ష సెప్టెంబర్ 21 నుండి 4 వరకు నిర్వహిస్తారు. కాగా, ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AIAPGET) 2024 ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం జూలై 6న నిర్వహించనున్నారు. ఇంతకుముందు జూన్ షిఫ్ట్ పరీక్షను జూన్ 18న రెండు షిఫ్టుల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే జూన్ 19న పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది.

జూన్ 18న 317 నగరాల్లో రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించారు. ఇందుకోసం 9 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్ లీక్ కారణంగా జూన్ 19న ఈ పరీక్ష రద్దు చేశారు. అప్పటి నుండి, NTA పారదర్శకతపై ప్రశ్నలు నిరంతరం లేవనెత్తుతున్నాయి. కాగా, ఇప్పుడు ఎన్టీఏ కొత్త డీజీ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో NCET 2024 పరీక్ష జూలై 10, 2024న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జాయింట్ సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షను జూలై 25 నుంచి జూలై 27 మధ్య నిర్వహించనున్నారు. UGC NET జూన్ సైకిల్ పరీక్ష 21 ఆగస్టు నుండి 4 సెప్టెంబర్ 2024 మధ్య నిర్వహిస్తారు. కాగా ఈ సారి పెన్ను, పేపర్ కు బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆల్ ఇండియా ఆయుష్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ పరీక్ష 2024ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు.

Tags:    

Similar News