బిహార్‌లోని బగల్‌పూర్ నౌగచియాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు - బస్సు ఢీకొనడంతో 9 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వలకార్మికులతో వెళుతున్న లోడు లారీ, బస్సును ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డుపక్కనపడిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.