Anti Paper Leak Law: అమల్లోకి పేపర్ లీకేజీల నిరోధక చట్టం..పేపర్ లీకేజీలను కేంద్రం అరికట్టనుందా?

Anti Paper Leak Law: వరుస పేపర్ లీక్ లతో సతమతమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైనవారిపై చట్టపరంగాచర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను అమల్లోకి తీసుకువచ్చింది.

Update: 2024-06-22 00:42 GMT

Anti Paper Leak Law: అమల్లోకి పేపర్ లీకేజీల నిరోధక చట్టం..పేపర్ లీకేజీలను కేంద్ర అరికట్టనుందా? 

Anti Paper Leak Law: NEET, UGC NET పరీక్షల పేపర్ లీక్ తర్వాత గందరగోళం మధ్య, కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024ని అమలు చేసింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత పరీక్షల్లో అవకతవకలపై కఠిన చర్యలకు నిబంధనలు రూపొందించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమాల నివారణ) బిల్లు-2024ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. పబ్లిక్ పరీక్షా విధానంలో మరింత పారదర్శకత, సరసత, విశ్వసనీయతను తీసుకురావడానికి అన్యాయమైన మార్గాలను నిరోధించడం దీని లక్ష్యం. ఇది జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెబుతూ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసినా ఎన్నికల హడావుడి షురూ అవ్వడంతో అమలు తేదీని ప్రకటించలేదు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ ను ప్రశ్నించగా..న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని, త్వరలోనే నోటిఫై చేస్తామని ప్రకటించారు.

మంత్రి వ్యాఖ్యలు చేసిన 24గంటల్లోనే కేంద్ర సిబ్బంది, వ్యవహారాలశాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఎవరైనా చట్ట విరుద్దంగా పరీక్ష పేపర్లను అందుకున్నా..ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసేవారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్ వర్క్ ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, ఫేక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. కారకులకు 5 నుంచి 10ఏండ్ల వరకు జైలు శిక్ష, రూ. కోటి వరకు జరిమానా విధిస్తారు. దీనిలో భాగస్వాములు, వ్యవస్థీక్రుత నేరానికి పాల్పడినట్లు రుజువైనట్లయితే వారి ఆస్తులను జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చును వసూలు చేస్తారు. ఇక నుంచి పేపర్ లీకేజీ కేసులను ఈ చట్టం కింద నమోదు చేయనున్నారు.

Tags:    

Similar News