MS Swaminathan: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌ కన్నుమూత

MS Swaminathan: చెన్నైలోని ఇంట్లో కన్నుమూసిన 98 ఏళ్ళ స్వామినాథన్‌

Update: 2023-09-28 07:40 GMT

MS Swaminathan: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌ కన్నుమూత

MS Swaminathan: ఎం.ఎస్‌.స్వామినాథన్‌గా పేరు పొందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ చెన్నైలోని నివాసంలో కన్నుమూశారు. 98 ఏళ్ళ స్వామినాథన్‌ మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో 1925లో జన్మించారు. భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడైన స్వామినాథన్‌ను భారతదేశంలో హరిత విప్లవ పితామహుడుగా పిలుచుకుంటారు. ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ను స్థాపించి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై స్వామినాథన్‌ ప్రధానంగా కృషి చేశారు.. అలాగే ఇతర దేశాలకు చెందిన ఎన్నో మేలైన వరి రకాలను మన దేశంలోకి ప్రవేశపెట్టి, వాటి నుంచి కొత్త వరి రకాలను ఉత్పత్తి చేశారు.. దీంతో భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది.

మద్రాసు విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జి, మాడిసన్‌ యూనివర్సిటీల్లో చదువుకున్న స్వామినాథన్‌ను పలు అవార్డులు వరించాయి. పద్మశ్రీ ,రామన్ మెగసెసే, పద్మభూషణ్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ అవార్డ్ ఆఫ్ సైన్స్, పద్మవిభూషణ, వరల్డ్ ఫుడ్ ప్రైజ్, టైలర్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ అఛీవ్‌మెంట్‌, వోల్వో ఎన్వినాన్‌మెంటల్ ప్రైజ్, ఇందిరా గాంధీ శాంతి బహుమతి, ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం అందుకున్నారు.

Tags:    

Similar News