Corona Patients Missing in Bengaluru: బెంగళూరులో కరోనా పేషెంట్ల అదృశ్యం
Corona Patients Missing in Bengaluru: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు
Corona Patients Missing in Bengaluru: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో 3,338 మంది కరోనా రోగులు అదృశ్యమయ్యారనీ, వారు తప్పుడు ఫోన్ నెంబర్లు, వివరాలిచ్చారని అధికారులు వెల్లడించారు. వారి ఆచూకి తెలియరాలేదనీ, వారు కరోనా టెస్టుల సమయంలో తప్పుడు సమాచారమిచ్చారని, కరోనా పాజిటివ్ రాగానే అందుబాటులో లేకుండా పోయారని బెంగళూరు నగర కమిషనర్ ఎన్ మంజునాథ్ ప్రసాద్ తెలిపారు.
కరోనాబాధితులంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారా? అనే విషయం తెలియడం లేదని అధికారులు వాపోతున్నారు. ఆచూకీని కనుగొనడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. వారందరి ఆచూకీని కనుగొని క్వారంటైన్ చేయాలని, వారందరిని ఐసొలేట్ చేయడానికి తీర్మానించుకున్నట్టు డిప్యూటీ సీఎం డాక్టర్ అశ్వత్ నారాయణ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే కరోనా టెస్టు కోసం నమూనాలు సేకరించేటప్పుడే వారికి ఐడీకార్డులు ఇచ్చి మొబైల్ నెంబర్లనూ పరీక్షించాలని అధికారులు ప్రభుత్వాన్ని అడగనున్నట్టు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని సగం కేసులు కేవలం రాజధాని నగరంలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ ఉదంతం వెలుగులోకి రావడం మరింత కలకలం రేపుతున్నది.