Ayushman Bharat: మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..వారికి కూడా రూ. 5లక్షలు..పూర్తి వివరాలివే
Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ కింద 70ఏండ్ల పైబడిన వారందరికీ రూ. 5లక్షల ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 70 ఏండ్లు పైబడిన వారందరికీ వారి ఆదాయంతో సంబంధం లేకుండా రూ. 5లక్షల ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Ayushman Bharat Health Insurance Scheme: ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనలో 70 ఏళ్లు..అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అన్ని వర్గాలను చేర్చాలంటూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం కింద లబ్ధిదారులు చాలా పెద్ద ప్రయోజనాలను పొందుతారు. ఈ స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఎంతమందికి ప్రయోజనం:
ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5,00,000 వరకు నగదు రహిత ఆరోగ్య రక్షణ లభిస్తుంది. ప్లాన్ కింద కవర్ వివిధ రకాల చికిత్స ఖర్చులను కలిగి ఉంటుంది. ఇది రోగ నిర్ధారణ, మందుల వంటి ఖర్చులను 3 రోజుల వరకు ప్రీ-హాస్పిటలైజేషన్, 15 రోజుల పోస్ట్-హాస్పిటలైజేషన్ కోసం కవర్ చేస్తుంది.
ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద కుటుంబ పరిమాణం, వయస్సు లేదా లింగంపై ఎలాంటి పరిమితి లేదు. ఈ పథకం ప్రయోజనాలు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అంటే లబ్ధిదారుడు భారతదేశంలోని ఏదైనా జాబితాలో ఉన్నా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి నగదు రహిత చికిత్సను పొందవచ్చు. రూ. 5,00,000 ప్రయోజనం ఫ్యామిలీ ఫ్లోటర్ ఆధారంగా ఉంటుంది. అంటే దీనిని కుటుంబంలోని ఒకరు లేదా అందరూ ఉపయోగించుకోవచ్చు.
వృద్ధులు ఉన్న కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద బీమా మొత్తం రూ.10 లక్షలు. అదనపు మొత్తాన్ని వృద్ధులకు మాత్రమే కేటాయిస్తారు. బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 4.50 కోట్ల కుటుంబాలకు చెందిన ఆరు కోట్ల మంది వృద్ధులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రస్తుతం 12.30 కోట్ల కుటుంబాలను ఆయుష్మాన్ భారత్ పథకంలో చేర్చారు. అర్హులైన సీనియర్ సిటిజన్లకు కొత్త ప్రత్యేక కార్డు జారీ చేస్తుంది. సాయుధ దళాలు, ఇతర వైద్య బీమా పథకాల పరిధిలో ఉన్న వృద్ధులకు ఎంపికను ఎంచుకునే హక్కు ఉంటుంది.
ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి?
ఆయుష్మార్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధులతో నడుస్తుంది. సెకండరీ,త్రుతీయ కేర్ హాస్పిటలైజేషన్ లకు ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 5లక్షల ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. కుటుంబ సభ్యుల వయస్సుతో సంబంధం లేకుండా 12.34కోట్ల కుటుంబాలకు చెందిన 55 కోట్ల మందికి ఈ ఆయుష్మాన్ భారత్ స్కీం వర్తిస్తుంది.