ఢిల్లీలో మ‌రోసారి భూప్రకంపనలు

Update: 2020-06-04 06:31 GMT

నాలుగు రోజుల వ్య‌వ‌ధిలోనే దేశ రాజధాని ఢిల్లీలో మ‌రోసారి భూప్రకంపననలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ విడుదల చేసిన సమాచారం ప్రకారం బుధవారం అర్థరాత్రి ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో రిక్టర్ స్కేల్‌పై 3.2 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. రాత్రి 10 గంటల 42 నిమిషాల వద్ద ఈ ప్రకంపనలు రావడంతో భ‌యాందోళ‌న‌ల‌తో ప్ర‌జ‌లు బ‌య‌టికి ప‌రుగులు తీశారు. నోయిడాకు ఆగ్నేయంగా 19 కిలోమీటర్ల దూరంలో 3.8 కిలోమీటర్ల లోతులో ప్రకంపన నమోదైందని ఎన్‌సిఎస్ తెలిపింది.

దీని తీవ్ర‌త‌తో ఢిల్లీ, ఫ‌రీదాబాద్, గురుగ్రామ్ అంత‌టా భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. అయితే ప్రాణ‌న‌ష్టం, ఆస్తిన‌ష్టం లాంటివి జ‌ర‌గ‌లేదని నివేదించింది. భూకంప కేంద్రం ఉత్తర ప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని గ్రేటర్ నోయిడాకు దగ్గరగా ఉంది.. దాని అక్షాంశం , రేఖాంశం వరుసగా 28.4015 , 77.5185 గా నమోదైంది. 

Tags:    

Similar News