Maoists: మావోయిస్టుల చేతిలో మరో మహిళ హత్య..

Maoists: ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టుల ఘాతుకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో మహిళను మావోయిస్టులు హత్య చేయడం కలకలం రేపింది.

Update: 2024-12-08 10:32 GMT

Maoists: మావోయిస్టుల చేతిలో మరో మహిళ హత్య..

Maoists: ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టుల ఘాతుకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో మహిళను మావోయిస్టులు హత్య చేయడం కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లాలోని పటేల్‌ పరా గ్రామానికి చెందిన సుఖ దంపతులను గత రాత్రి మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. సుఖను దారుణంగా కొట్టి హతమార్చారు.

సుఖ భర్త రామయ్యను తీవ్రంగా కొట్టి వదిలేశారు. అర్థరాత్రి సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని విగతజీవిగా పడి ఉన్న సుక్ర మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్పీ జితేంద్ర యాదవ్‌ తెలిపారు.

Tags:    

Similar News