పళనిస్వామికి మద్రాస్ హైకోర్టు షాక్.. పన్నీర్ సెల్వంకు ఊరట..
AIADMK Party: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్రాసు హైకోర్టు షాకిచ్చింది.
AIADMK Party: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. అన్నాడీఎంకే పార్టీలో జూన్ 23 కంటే ముందున్న స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వ విధానం కొనసాగించాలని కీలక తీర్పు చెప్పింది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని స్వామి ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ ఇద్దరి అనుమతి లేకుండా అన్నాడీఎంకే సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించడాన్ని తప్పుపట్టింది. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశాన్నితిరిగి నిర్వహించాలని పార్టీని ఆదేశించింది. మద్రాసు హైకోర్టు తీర్పు చారిత్రకమని మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అన్నారు. ఈ తీర్పు వల్ల తాము విజయం సాధించామని చెప్పారు. పార్టీలో ఎవరైనా తమతో కలిసేందుకు వస్తే స్వాగతిస్తామన్నారు.