India Elections 2024: దేశ వ్యాప్తంగా ముగిసిన మూడో దశ ఎన్నికల పోలింగ్
Phase 3 Voting: సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడో విడత పోలింగ్ ముగిసింది. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది.
Phase 3 Voting: సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడో విడత పోలింగ్ ముగిసింది. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. మూడో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని 93 లోక్‌సభ స్థానాల్లో...ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అయితే.. సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది ఈసీ. మూడో దశలో 120 మంది మహిళలు సహా 13 వందలకు పైగా అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.
ఈ రోజు జరిగిన ఎన్నికల్లో..పలువురు ప్రముఖులు వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా , జ్యోతిరాదిత్య సింధియా, మన్‌సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాలా, ప్రహ్లాద్ జోషి, ఎస్పీ సింగ్ బఘేల్ బరిలోకి దిగారు. ఇక మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్, దిగ్విజయ్‌సింగ్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్, కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, బారామతిలో వదినా, మరదళ్లు సునేత్రా పవార్, సుప్రియా సూలే తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
మూడో దశ ముగియడంతో... మొత్తం 543 లోక్‌సభ స్థానాలకుగాను ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283కి చేరుకుంది. నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ ఒకటో తేదీన నిర్వహిస్తారు. జూన్ 4న అన్ని లోక్‌సభ స్థానాల ఫలితాలను వెలడించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.