Tamil Nadu: క‌రోనా కాటుకు మృగ‌రాజు బ‌లి

Tamil Nadu: ఈ జూలో ఉన్న మొత్తం 11 సింహాల్లో 9 సింహాలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

Update: 2021-06-04 12:48 GMT
తమిళనాడు లో సింహం కు కరోనా పాజిటివ్ (ఫైల్ ఇమేజ్)

Tamil Nadu: క‌రోనా మ‌హ‌మ్మారి దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తుంది. అయితే క‌రోనా మ‌నుషుల‌కు మాత్ర‌మే సోకుతుంద‌ని అనుకుంటుంటే..హైద‌రాబాద్ లోని ఓ జూలో సింహాల‌ల్లో క‌రోనా బ‌య‌ట‌ప‌డ‌డం సంచ‌ల‌నం రేపింది. తాజాగా క‌రోనా జంతువులపై కూడా ప్రభావం చూపుతోంద‌ని మ‌రో సారి వెల్ల‌డైంది.తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్కులో 'నీలా' అనే ఆడ సింహం కరోనా బారిన పడి ప్రాణాలు విడిచింది. దీని వయసు తొమ్మిది సంవత్సరాలు.

ఈ జూలో ఉన్న మొత్తం 11 సింహాల్లో 9 సింహాలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. లాక్ డౌన్ కారణంగా నెల రోజులుగా జూ మూతపడి ఉన్నప్పటికీ... వీటికి కరోనా సోకడం గమనార్హం. మరోవైపు జూలో పని చేస్తున్న సిబ్బంది మొత్తం వ్యాక్సిన్ వేయించుకున్నారు. వీరిలో ఎవరికీ కరోనా లేకపోవడం గమనించాల్సిన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో సింహాలకు కరోనా ఎలా సోకిందనే విషయంపై అధికారులు దృష్టి సారించారు.

త‌మిళ‌నాడులో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. ఈ నేఫ‌థ్యంలో ఆ రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డి ప్రభుత్వం క‌ఠిన నిబంధ‌ల‌ను అమ‌లు చేస్తుంది.తాజాగా క‌రోనా జంతువుల్లో బ‌య‌ట‌ప‌డ‌డంతో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుంది.

Tags:    

Similar News