TET: టెట్ సర్టిఫికెట్ లైఫ్ టైమ్ చెల్లుబాటు!
TET: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం వెల్లడించింది.
TET: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం వెల్లడించింది. టెట్ సర్టిఫికేట్ పై ఉండే 7 ఏళ్ల గడువును ఎత్తివేస్తూ.. ఆ సర్టిఫికెట్ లైఫ్ టైం చెల్లుబాటు అయ్యేలా సవరణలు చేసింది. ఈమేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. టీచర్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేవారికి టెట్‌ను తప్పనిసరి చేసింది కేంద్రం. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ ఎగ్జామ్ ను నిర్వహిస్తున్నాయి. ఒకసారి టెట్ ఎగ్జామ్ పాసైతే దాని వ్యాలిడిటీ ఏడేళ్లపాటు ఉండేది. ఈ గడువు లోపల ఉద్యోగం సాధిస్తేనే ఆ సర్టిఫికెట్ పనిచేసేది. లేదంటే మరోసారి టెట్ ఎగ్జామ్ రాయాల్సి వచ్చేది.
కేంద్రప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం ఒకసారి టెట్ ఎగ్జామ్ పాసైతే చాలు, ఉద్యోగం సంపాదించే వరకు ఆ సర్టిఫికెట్ పనిచేయనుంది. అయితే ఇప్పటికే టెట్ అర్హత సాధించి ఏడేళ్లు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా కొత్త సర్టిఫికెట్లను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2011 నుంచి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఈ నిబంధన వర్తించనుంది.