బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక విషయాలు
Bengaluru: సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో పార్టీ
Bengaluru: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వాసు ఈవెంట్ ఏర్పాటు చేసినట్టు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి నాన్‌స్టాప్‌గా పార్టీ నిర్వహించినట్టు చెప్పారు. ఈ ఈవెంట్‌కు 150 మంది హాజరయ్యారని, పార్టీలో పలువురు పెడ్లర్లు డ్రగ్స్ అమ్మినట్టు గుర్తించామన్నారు.
సోమవారం ఉదయం 3 గంటలకు గోపాల్‌రెడ్డి ఫామ్‌హౌస్‌పై రైడ్స్ చేశామన్న పోలీసులు.. ఐదుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు. నిర్వాహకుడు వాసు, అరుణ్, సిద్ధికి, రన్దీర్, రాజ్‌భవ్‌ను అరెస్ట్ చేశామని, వాసు బర్త్‌డే సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశారన్నారు. వాసు, అరుణ్ బంధువులు కాగా.. ఈవెంట్ మొత్తానికి ఇన్‌ఛార్జ్‌గా అరుణ్ వ్యవహరించారని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు తెలిపారు.