Kerala: గాలి ద్వారా వ్యాపించే కరోనాకు చెక్.. కేరళ సైంటిస్టుల కొత్త పరికరం

Kerala Scientists: గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు ఒక ఎలక్ట్రానిక్‌ సాధనాన్ని చేశారు.

Update: 2021-04-12 06:55 GMT

‘వుల్ఫ్‌ ఎయిర్‌మాస్క్ (ఫైల్ ఇమేజ్)

Kerala Scientists: గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేరళ శాస్త్రవేత్తలు ఒక ఎలక్ట్రానిక్‌ సాధనాన్ని అభివృద్ధి చేశారు. 'వుల్ఫ్‌ ఎయిర్‌మాస్క్‌' అనే ఈ సాధనం.. వైరస్‌ను నిర్వీర్యం చేస్తుందని వారు తెలిపారు. 'ఆల్‌ అబౌట్‌ ఇన్నోవేషన్స్‌' అనే అంకుర సంస్థ దీన్ని రూపొందించింది. ఈ సాధనం.. 15 నిమిషాల్లోనే 99 శాతం మేర కరోనా వైరస్‌ను తగ్గిస్తుందని కేంద్ర బయోటెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని రాజీవ్‌ గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. దీన్ని స్విచ్చాన్‌ చేయగానే తన రక్షణ చట్రాన్ని నలువైపులకూ విస్తరిస్తుందని పరిశోధకులు తెలిపారు.

ఇళ్లు, కార్యాలయాలు, ఆసుపత్రులు, హోటళ్లు తదితర ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటుందని చెప్పారు. 'నెగెటివ్‌ అయాన్‌' పరిజ్ఞానం ఆధారంగా ఇది పనిచేస్తుందని వివరించారు. ఒక పరికరం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలోని గాలిని శుద్ధి చేస్తుందన్నారు. దీనికి ఎలాంటి సర్వీసింగ్‌ కూడా అవసరంలేదని చెప్పారు. వైరస్‌ను మాత్రమే కాకుండా సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంద్రాలనూ ఇది నిర్వీర్యం చేయగలదని వివరించారు. 

Tags:    

Similar News