MUDA Case: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టు బిగ్ షాక్
MUDA Case: కర్ణాటక సీఎం సిద్దరామయ్య దాఖలు చేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.
MUDA Case: కర్ణాటక సీఎం సిద్దరామయ్య దాఖలు చేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ముడా కేసులో విచారించాలని గవర్నర్ ఆదేశించారు. ఈ ఆదేశాలను సిద్దరామయ్య సవాల్ చేశారు. ఈ విషయమై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత సీఎం సిద్దరామయ్య పిటిషన్ ను కొట్టివేసింది.
ముడా స్కామ్ ను ముగ్గురు సామాజిక కార్యకర్తలు బయటకు తీసుకువచ్చారు. ఈ విషయమై లోకాయుక్తతో పాటు కర్ణాటక గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1998లోని సెక్టసన్ 17 ప్రకారంగా సీఎం సిద్దరామయ్యపై విచారణకు ఆదేశించారు. అయితే గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్దరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. సిద్దరామయ్య దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ తీర్పుపై సిద్దరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
ముడా స్కాం అంటే ఏంటి?
మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ అభివృద్ది కోసం మైసూరులోని కేసరేలో సీఎం సిద్దరామయ్య భార్య పార్వతి నుంచి 2021లో మూడు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి ప్రతిఫలంగా ఆమెకు దక్షిణ మైసూరులోని విజయనగర్ లో భూమిని కేటాయించారు. విజయనగర్ లోని భూమి ధర కేసరెలో భూమి కంటే చాలా ఎక్కువ. ఇదే వివాదానికి కారణమైంది. ముడా ద్వారా భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అయితే ఎన్నికల అఫిడవిట్ లో ఈ విషయాన్ని సిద్దరామయ్య ప్రస్తావించలేదని సామాజిక కార్యకర్త అబ్రహం తన ఫిర్యాదులో చెప్పారు.